నంద్యాల:నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ ఆర్ రమణ నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల నంద్యాల జిల్లా పోలీసు అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ సిబ్బందితో మాట్లాడి ఆఫీసుకు సంబంధించిన రికార్డులు సరిగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఒకొక్క విభాగం వాటికి సంబందించిన రికార్డులను పరిశీలించారు. ఆఫీసు సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు.
ఇన్ వర్డ్,అవుట్ వర్డ్ రిజిస్టర్స్ ను తనిఖీ చేశారు తపాలకు సంబందించిన రికార్డులు సరిగా ఉంచుకోవాలని ఆదేశించారు. తరువాత పోలీస్ సిబ్బంది మెడికల్ బిల్లుల రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ బిల్లులను త్వరగా క్లియర్ చేసి సిబ్బందికి టైం కు అందించాలని ,ఆఫీసు లో పెండింగ్ ఉండకుండా చూసుకోవాలని ఆదేశించారు. పోలీసు సీనియారిటీకి సంబండిచిన రికార్డులు, వారి ప్రమోషన్ కు సంబందించిన రికార్డులను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా జాగ్రతగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రమోషన్ వచ్చేలా రికార్డులు ఉంచుకోవాలని ఆదేశించారు.ఈ ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నిజాముద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.