ఎమ్మెల్యే డాక్టర్. సంజయ కుమార్
జగిత్యాల:అగ్నితో మంటలు చిలరేగడం ,విద్యుత్ షార్ట్ సర్క్యుట్ తో ప్రాణ,ఆస్తి నష్టాలు సంభవిస్తూంటా యని చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా సంబంధించే పేను ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా అగ్నిమాపక సేవలు శాఖ పనిచేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆన్నారు.. గురువారం తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్ని మాపక సేవల శాఖ వారి అధ్వర్యంలో నేషనల్ ఫైర్ సర్వీస్ డే సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 20 తేది వరకు జరిగే అగ్ని మాపక వారోత్సవాలు ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొనీ,అగ్ని ప్రమాదం లో వాడే వివిధ పరికరాలు,మోటార్ సైకిల్ ను పరిశీలించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఎక్కువ అని,వాటిని నివారించడంలో అగ్ని మాపక శాఖ పాత్ర కీలకమైనది.అగ్ని ప్రమాదాల నివారణ విషయంలో ప్రజలకు అవగాహన తప్పనిసరి ఆని ఆన్నారు.101 నంబర్ కి ఫోన్ చేయటం ద్వారా అగ్నిమాపక శాఖ త్వరితగతిన చేరుకొని అగ్ని ప్రమాదాలని నివారించవచ్చునని ఆన్నారు.అగ్ని ప్రమాదాలు నివారించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వచ్చిందని అన్నారు.అప్రమత్తత ద్వారా నే అగ్నిప్రమాదాలు నివారించవచ్చుని చెప్పారు.
ప్రమాదాలు సంభవించినప్పుడు వేడి గాలి పొగ పైకి వెళ్తుందని,పోగలో చిక్కుకున్న వారు ముక్కును నేలకు పేట్టడం ద్వారా ఆక్సిజన్ దొరికి ప్రాణాలు కాపాడుకొచ్చిన,ప్రజలు కు అగ్ని ప్రమాదాల పై అవగాహన అవసరం అని అన్నారు.ఫైర్ సిబ్బంది ప్రాణాలు లెక్కచేయకుండా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షిస్తారనీ వారి సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంఛార్జి ఛైర్మెన్ గోలి శ్రీనివాస్,అగ్ని మాపక అధికారి కోమురయ్య,సిబ్బంది,కౌన్సిలర్ లు దాసరి లావణ్య ప్రవీణ్, బోడ్ల రాజు, ముస్కు నారాయణ రెడ్డి,అల్లే గంగసాగర్,తోట మళ్ళీకార్జున్,,కో ఆప్షన్ శ్రీనివాస్,ఆర్టీఏ జిల్లా మెంబర్ సుధాకర్ రావు,నాయకులు సమిండ్ల శ్రీనివాస్,డిష్ జగన్,కొలగాని సత్యం,క్రిష్ణ రావు,అంజాయ్య గౌడ్,యూత్ పట్టణ ప్రధాన కార్యదర్శి శరత్ రావు,కూతురు శేఖర్,వంశీ బాబు,ఎల్ వెంకన్న,రవీందర్ రావు,భాస్కర్ రావు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.