Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పక్కా ఆధారాలతోనే చంద్రబాబు అరెస్టు సజ్జల

TDP chief Chandrababu Naidu arrested in A.P. Skill development scam

0

విజయవాడ: స్కిల్ డెవలప్మెం ట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు.  స్పష్టమైన ఆధారాలతోనే చంద్రబాబును సిఐడి   అరెస్ట్ చేసిందని వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు రాత్రికి రాత్రి జరిగింది కాదు.  అసలు విషయం చెప్పకుండా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆర్థిక నేరాల్లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు.  2017-18లోనే జీఎస్టీ డీఐజీ నేతృత్వంలోనే బాబు హయాంలో రిలీజ్ చేసిన రూ.370 కోట్లలో రూ.241 కోట్లు దారి మళ్లాయని గుర్తించింది.   దబాయించి బాబు చేసిన తప్పుల నుంచి బయటపడాలనుకుంటే కుదరదు. ప్రజల కళ్లు గప్పి చంద్రబాబు మాయా ప్రపంచం చూపించి, అసలు విషయాన్ని దాచేశారు.

డిజైన్ టెక్ కంపెనీకి మళ్లించిన రూ.370 కోట్లు వివిధ షెల్ కంపెనీల ద్వారా మరలా బాబుకు చేరాయి. తేదీలేని ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఇది వంద శాతం అప్పటి ప్రభుత్వ ఎయిడెడ్ స్కామ్. సీమెన్స్ సంస్థ పేరు వాడుకుని అవినీతికి పాల్పడ్డారు.  ఈ స్కాం సుష్టికర్త చంద్రబాబే అని విచారణలో బయటపడుతుంది.  లేని ప్రాజెక్ట్ ను ఉన్నట్టుగా సృష్టించారు.  కానీ ఇదంతా చంద్రబాబు నాయుడుకి తెలుసు, అరెస్ట్  చేస్తారని తెలిసి ముందుగానే గ్రౌంగ్ ప్రిపేర్ చేసుకున్నారు.   09.12.2021లో ఎప్ ఐఆర్ నమోదైంది, దీని ఆధారంగానే సీఐడీ సిట్ చాలా మందిని అరెస్టులు చేసింది.  ఈడీ,సీఐడీ పెట్టిన కేసులు, అరెస్టు చూస్తుంటే… జగన్ పాలనలో ఎంత స్వచ్చందంగా ఈ సంస్ధల పని చేస్తున్నాయో స్పష్టంగా అర్దమవుతోంది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అన్ని ఆధారాల ఉన్నాయి కాబట్టే దర్యాప్తు సంస్ధ ఈ చర్యకు పూనుకుంది.  టీడీపీ నేతలు కన్యూప్ చేస్తున్నారు కాబాట్టే మేం దానికి ప్రజలకు వివరణ ఇస్తున్నాం.  చంద్రబాబు విషయంలో ఎలాంటి కక్ష్య సాధింపు లేదు. ఆధారాలను బట్టి దర్యాప్తు సంస్థలు చర్యలు చేపడుతున్నాయి.  చంద్రబాబు అరెస్టుకు రాజకీయాలతో సంబంధం లేదు.  తాను అరెస్ట్ అవుతున్నానని చంద్రబాబు దబాయించారు.  సింపతీ వస్తుందని చంద్రబాబు కోరుకుంటున్నారు. స్కామ్ జరిగిన మాట వాస్తవం కాదా?  అవినీతి జరగలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి. కక్ష సాధింపులకు పాల్పడాల్సిన అవసరం మాకు లేదని సజ్జల అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie