చంద్రబాబు ను పోలీసులు అరెస్టు చేసిన తీరు బాధాకరం
The manner in which Chandrababu was arrested by the police is sad
జేడియు ఆంధ్ర ప్రదెశ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కరణం తిరుపతి నాయుడు
గుంటూరు సెప్టెంబర్ 9: టిడిపి అధినేత,ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ను పోలీసులు అరెస్టు చేసిన తీరు బాధాకరమని జేడియు ఆంధ్ర ప్రదెశ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కరణం తిరుపతి నాయుడు అన్నారు.తెలుగు రాష్ట్రాల అభ్యున్నతిపైనే దృష్టి సారించిన నిలువెత్తు నాయకుడు చంద్రబాబు అని అలాంటి నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి వారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాన్నిఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టు అక్రమం, చట్ట విరుద్ధమని అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం, దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేపట్టడానికి గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని 17ఎ(సి) సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సిందన్నారు.
గవర్నర్ అనుమతి తీసుకోకపోయినా, అరెస్ట్ పత్రాలు చూపించక పోయిన మొత్తం దర్యాప్తు చెల్లుబాటు కాదని తిరుపతి నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి విపక్ష నేతలపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి వేళ ఏపీలో అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.చంద్రబాబు పట్ల ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందన్నారు. ఏ తప్పుచేయని నాయకులపై కూడా హత్య కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అర్ధరాత్రి సమయంలో నోటీసులు ఇవ్వడం… అరెస్టు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. బాబు పారిపోయే మనిషి కాదన్నారు. విచారణకు పిలవకుండా డైరెక్ట్‌గా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తండ్రిని చూడడానికి వెళ్తోతున్న లోకేశ్‌ను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.