టీడీపీ అధినేత చంద్రబాబు
రేపో, ఎల్లుండో తనను అరెస్టు చేయొచ్చునని టీటీపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. నీతి నిజాయితీగా నిప్పులా బతికిన తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. బుధవారం ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడారు.
ఏపీలోని వైఎస్సార్ సీపీ పాలనలో పెద్ద ఎత్తున ప్రజా ఆస్తుల దోడిడీ జరుగుతుందని ఆరోపించారు. సీఎం జగన్ కరుడుగట్టిన సైకో అని ధ్వజమెత్తారు. తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.