Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆంధ్ర పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి..

0

2022 -23 విద్యాసంవత్సరానికి అమ్మ ఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వరుసగా నాలుగో ఏడాది బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కార్యక్రమంలో జగన్  42.61లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,392.94 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగానే ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ పది రోజుల పాటు పండుగల జగనన్న అమ్మ ఒడి కొనసాగుతుందని తెలిపారు.ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని జగన్ అన్నారు.

 

నాలుగేళ్లలో కేవలం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా రూ.26,067.28 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు. విద్యా రంగంలో సంస్కరణలపై అక్షరాలా రూ.66,722.36 కోట్లను వినియోగించామన్నారు. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కురుపాంలో నాలుగో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇరవై ఆరువేల కోట్లు ఇప్పటి వరకు ఈ పథకానికి ఇవ్వడం జరిగింది అని వెల్లడించారు..

 

ఇదంతా మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే లబ్ధిదారులకు నేరుగా అందింది.. పిల్లల భవిష్యత్తు కోసం.. బడికి పిల్లలను పంపించేందుకు ఆ తల్లులకు ఇచ్చే ప్రోత్సాహకం ఇది… దేశంలో మరెక్కడా జరగటం లేదు… ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది అన్నారు.. నాలుగేళ్లలో రాష్ట్రంలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని వెల్లడించారు.. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందులో భాగంగా పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహిస్తాం అని తెలిపారు.ఇక, నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి నిండు మనసుతో.. హృదయపూర్వక కృతజ్ఞతలంటూ తన ప్రసంగం ప్రారంభించారు సీఎం వైఎస్‌ జగన్‌. తల్లులు తమ పిల్లలను బడులకు పంపేందుకు అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం.

 

ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో.. క్లాస్‌ టీచర్లకే గతిలేని పరిస్థితి గతంలో చూశాం. ఇప్పుడు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు ఉండేలా చేస్తున్నాం. మన పిల్లలు గ్లోబల్‌ సిటిజన్స్‌గా తయారు కావాలి అని సీఎం జగన్‌ వేదిక నుంచి ఆకాంక్షించారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ కరికులమ్‌ తీసుకొస్తున్నాం. ఆరో తరగతి నుంచే క్లాస్‌ను డిజిటలైజ్‌ చేస్తున్నాం అని తెలిపారాయన. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం, విద్యాకానుక కిట్లు అందించడం, మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు.. టోపేన్ కోసం మూడు నుంచే ప్రత్యేక తరగతులు ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు చేశాం అన్నారు.

ఏపీలో అరవై లక్షల దొంగ ఓట్లు..

గతంలో పెత్తందార్లకే అందుబాటులో ఉన్న చదువులు .. ఇప్పుడు పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు సీఎం జగన్‌.. పెత్తందారీ విద్యావిధానాన్ని బద్ధలు కొట్టి.. అన్నివర్గాలకు ఉన్నతవిద్యను అందిస్తున్నామన్నారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడులని తీర్చిదిద్దాం. ప్రైవేట్‌ బడులతో ప్రభుత్వ బడులు పోటీపడే పరిస్థితికి చేరుకుంది. చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం. ప్రభుత్వ బడుల్లోనూ వజ్రాలు, రత్నాల్లాంటి పిల్లలు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అని పేర్కొన్నారు.. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం.

 

అంగన్వాడీలలో గర్భిణీ లకు సంపూర్ణ పౌష్టికాహార అందిస్తున్నాం.. 45 వేల ప్రభుత్వ స్కూలలో నాడు నేడు ద్వారా మార్పులు చేస్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య అందిస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ ట్యాబ్ లను అందిస్తున్నాం.. వందశాతం ఫీజురీయంబర్సమెంట్ అందిస్తుంది ఈ మన ప్రభుత్వం అన్నారు.హాస్టల్, మెస్ ఖర్చుల కోసం వసతి దీవెన కార్యక్రమం పెద్ద చదువులు చదివిన వారికి అందిస్తున్నాం అని గుర్తుచేశారు సీఎం జగన్‌.. సత్యానాదెండ్ల మాదిరిగా ప్రతి ఇంటి నుంచి రావాలని ఆకాంక్షిస్తున్నాను.. పెద్ద పెద్ద యూనివర్సిటీ లలో సీటు వస్తే చాలు చదివించడానకి మీ మేనమామ ఉన్నాడు అని స్పష్టం చేశారు.

 

నాలుగు సంవత్సరాల కాలంలో సంస్కరణలు కోసం అరవై అరువేల ఏడు వందల వేల కోట్లు ఖర్చు చేశామన్న ఆయన.. గత ప్రభుత్వం చివరి విద్యా సంవత్సరంలో గ్రాస్ ఎన్రోర్మెంట్ రేసియో లో మన రాష్ట్రం అట్టడుగున ఉంటే.. ఇప్పుడు 100.08 శాతానికి చేరుకున్నాం అన్నారు. రాబోయే నెలలో ట్రైబుల్ యూనివర్సిటీ కి శంకుస్థాపన చేసుకోబోతున్నాం.. గాంధీ గారు మూడు కోతుల కథ అందరికీ తెలుసు.. ఇవి చెప్పే నీతి చెడు వినకు చూడకూ మాట్లాడకు అని చెబుతాయి. మన రాష్ట్రంలో మాత్రం నాలుగు కోతులు ఉన్నాయి..

కర్ణాటక సర్కార్ ప్రభుత్వంలో లుకలుకలు నేను సీఎంలా బ్యాక్ స్టెప్ వేయనంటున్న డిప్యూటీ సీఎం..

మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచు చేయకన్నది వీరి నీతి అంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు సీఎం వైఎస్‌ జగన్‌ పిల్లలకు అర్థమయ్యేందుకు డిజిల్ బోధనను తీసుకొచ్చామన్నారు జగన్. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ.. ట్యాబ్‌లు సైతం అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు తొలిసారిగా బైలింగ్యువల్‌ పుస్తకాలు కూడా ఇచ్చామన్నారు. వంద శాతం పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ జగనన్న విద్యా దీవెన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే అమ్మఒడి అమలు అవుతుందని స్పష్టం చేశారు. విదేశాల్లో పెద్ద చదువుల కోసం విద్యార్థులకు ఎక్కడ సీటు వచ్చినా.. కోటి 25 లక్షల అందజేస్తున్నామన్నారు. బడులు ప్రారంభం అయిన వెంటనే మెరుగైన విద్యా కానుక కిట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie