ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులు అరెస్ట్ అయ్యారు. నిందితులనుంచి 10.17 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 3 వేల నగదు ,6 ఏటీఎం కార్డులను ఏర్పేడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి భవ్య కిషోర్ వెల్లడించారు. ఏర్పేడు హెచ్.పీ గ్యాస్ సమీపంలో గంజాయి రవాణా జరుగుతుందని సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడి చేసారు. స్మగ్లింగ్ పాల్పడుతున్న నిందితులు కేరళ రాష్ట్రానికి చెందిన పి. రవిచంద్రన్, నెల్లికల్ మోహనన్ గా గుర్తించారు. గంజాయి స్మగ్లింగ్ లో గతంలో ముగ్గురు పట్టుబడగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. అనకాపల్లికి చెందిన పవన్, నిరంజన్ , తో పాటు కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీజిత్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు.