పాకిస్తానీ యువకుడు మహ్మద్ ఫయాజ్ తో పాటు అతని అత్తమామలపై కేసు నమోదు. పాకిస్తానీ కి ఆధార్ కార్డు సృష్టించిన అత్తమామలు. మామ షేక్ జుబేర్ తో పాటు అత్త అఫ్జల్ బేగం పరారీ. పాకిస్తానీ ఫయాజ్ పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.
ఇక హైదరాబాద్ బహదూర్‌పురాకు చెందిన నేహా ఫాతిమా(29) కూడా ఉపాధి నిమిత్తం షార్జా వెళ్లింది. అక్కడ ఫయాజ్ సాయంతో ఉద్యోగం సంపాదించింది. అలా మొదలైన వారి పరిచయం చివరకు ప్రేమగా మారడంతో వారు 2019లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడు. ఆ తరవాత ఫయాజ్ పాకిస్థాన్ వెళ్లగా, నేహ ఫాతిమా నగరానికి వచ్చేసింది.