Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

యువతి అనుమానాస్పద మృతి…

Suspicious death of young woman

0
  • హత్య..? ఆత్మహత్య..?
  • మిస్సయిన యువతి చెల్లెలు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

యువతి అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం మేరకు పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన యువతి బంక దీప్తి (24) తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కోరుట్ల పట్టణానికి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి లకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. కుమారుడు బెంగళూరులో ఉండగా, మాధవి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఇంట్లోనే ఉంటుంది, చిన్న కూతురు చందన పూణేలో బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుండగా. దీప్తి తల్లిదండ్రులు దీప్తి, చందన లను ఇంటి వద్దనే వదిలి సోమవారం హైదరాబాదులో ఓ శుభకార్యానికి వెళ్లారు.

 

మంగళవారం ఉదయం కూతుర్లతో మాట్లాడుదామని ఫోన్ చేయగా కూతుర్ల ఫోన్ పని చేయకపోవడంతో. పక్కింటి వాళ్ళ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి తమ కూతుర్ల ఫోన్ లు కలవడం లేదని ఇంటి వద్దకు వెళ్లి చూడాలని కోరగా. ఇంటి వద్దకు వెళ్లిన పక్కింటి వాళ్లకు శ్రీనివాస్ రెడ్డి ఇంటి తలుపులకు గొళ్ళెం పెట్టి ఉండడంతో గొళ్ళెం తీసి చూడగా దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం కనబడడంతో తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు.

 

దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి ఉన్నత అధికారులకు సమాచారం అందించడంతో మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి, మెట్‌పల్లి, కోరుట్ల సిఐలు లక్ష్మీనారాయణ, ప్రవీణ్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ లు క్లూస్ టీమ్ తో వేలిముద్రలు సేకరించి విచారణ చేపట్టారు. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కాగా దీప్తి ఇంటికి మరో వ్యక్తి వచ్చినట్లు, ఇంటిలో ఫ్రై చేసిన చికెన్ తో పాటు మద్యం బాటిల్స్ ఉన్నట్లు, దీప్తి కి తోడుగా ఉన్న చెల్లెలు చందన కనబడకుండా పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో దీప్తి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie