సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. ఇప్పటికే జిన్నారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచారం ఆనవాళ్ళు లభించాయి. అనేక సందర్భాల్లో మూగజీవాలను చంపిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
Also Read: యువతి అనుమానాస్పద మృతి…
ఇదిలా ఉండగా బుధవారం మేతకు వెళ్లిన అవుపై దాడి చేసి మెడను కొరికి చంపేసింది పులి. దీంతో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసారు గ్రామస్తులు. ఇప్పటికే అనేక సార్లు అటవీ శాఖ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పులి దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని, పులిని భందించాలని డిమాండ్ చేస్తున్నారు.