కర్నూలు జిల్లా ఆదోనిలో పట్టపగలే వ్యక్తి పై దాడి జరిగింది. ఘటనలో ఎమ్మిగనూరు బైపాస్ సమీపంలో దాడికి గురైన మండగిరి పంచాయతీకి చెందిన శంకర్ (40) మృతి చెందాడు. పట్టపగలే ఇనుపరాడ్ తో శంకర్ పై ఒక యువకుడు దాడికి దిగాడు. సోమవారం సాయంత్రం శంకర్ మద్యం తాగి స్నేహితులతో గొడవపడ్డట్టు సమాచారం. గొడవ నేపథ్యంలో శంకర్ పై స్నేహితుడి దాడి జరిపాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ శంకర్ ను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరువాత పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పంసారు. అక్కడ చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందాడు.