Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఫస్ట్ నైట్ వద్దంటున్న భార్య.. సీన్ కట్ చేస్తే..

0

ఆ వ్యక్తికి 35 ఏళ్లు. ఎన్నో పెళ్లి సంబంధాలు చూసినా.. చివరి వరకు వచ్చి ఏదొక కారణంతో వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఓ పెళ్లిళ్ల పేరయ్య వద్దకు వెళ్లాడు. అతడు తీసుకొచ్చిన సంబంధం ఆ వ్యక్తికి నచ్చింది. అటు పెళ్ళికూతురు తరపు వాళ్లు కూడా ఒప్పుకున్నారు.. చివరికి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శోభనం ముహూర్తం రానే వచ్చింది. ఎంతో ఆతృతగా ఎదురుచూశాడు. కట్ చేస్తే.. నవ వధువు ఏదొక సాకుతో ఫస్ట్ నైట్‌ను వాయిదా వేస్తూ వచ్చింది. చివరికి వరుడు బలవంతం పెట్టగా.. అసలు విషయం బయటపడింది.

 

అంతే! ఆ వ్యక్తి జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది.వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన 35 ఏళ్ల చోటేలాల్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎంతకూ తనకు పెళ్లి కాకపోవడంతో.. చివరికి ఓ పెళ్ళిళ్ళ పేరయ్యను కలిశాడు. ఈ క్రమంలోనే ఒక సంబంధం కుదిరింది. సదరు పెళ్లికూతురు కుటుంబానికి నాలుగు లక్షలు ఇస్తానని చోటేలాల్ ఒప్పుకోవడంతో.. వారిద్దరి పెళ్లి కాస్తా అంగరంగ వైభవం జరిగింది. ఇక శోభనం ముహూర్తం రానే వచ్చింది. దాని కోసం చోటేలాల్ ఆతృతగా ఎదురుచూశాడు.

డాక్టర్ చదువు మానేసి.. వ్యభిచారం..

కానీ వధువు మాత్రం ఎప్పుడూ ఏదొక సాకు చెప్పి.. శోభానాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన చోటేలాల్ చివరికి ఫస్ట్ నైట్ జరగాలని బలవంతం చేయడంతో.. అసలు విషయం బయటపడింది. తనకు అంతకముందే పెళ్లి అయిందని ఆమె అసలు నిజాన్ని చెప్పింది. అంతే! దీంతో చోటేలాల్‌కు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. వరకట్నం కేసు పెడతానని వధువు బ్లాక్ మెయిల్ చేయడంతో చోటేలాల్ చేసేదేమిలేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie