కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ , రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే , ఎంపీ సంజయ్ రౌత్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ తో పాటు పలువురు రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు, ఇది చాలా సంతోషకరమైన రోజని, మీరు మీపట్టుదల, సహనంతో ప్రజలకు స్పూర్తినిస్తూ హృదయ పూర్వక ప్రయత్నాల ద్వారా సేవ చేస్తూ ఉండాలని షర్మిల ట్వీట్ లో కోరారు. ఆరోగ్యవంతంగా, సుఖ సంతోషాలతో విలసిల్లాలని అకాంక్షించారు.