ఒంగోలు: Comment on Voluntary System వాలంటరీ వ్యవస్ధపై కామెంట్ చేసిన పవన్ నాలుకను వెయ్యి సార్లు కోస్తామని, చీరేస్తామని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు YCP MLA TJR Sudhakar Babu వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. వాలంటరీ వ్యవస్దకు సంబంధించి పవన్ మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కు తీసుకోవాలన్నారు. పవన్ తైతక్కలాడితే ఆ సినిమాలు చూసి హిట్ చేసిన ఆయన అభిమానులకు కూడా వాలంటరీ వ్యవస్ద ద్వారానే పధకాలు అందచేస్తున్నామని తెలుసుకోవాలన్నారు. వాలంటరీ వ్యవస్దను, సచివాలయాలను వద్దంటున్న పవన్ తిరిగి జన్మభూమి కమిటీలను తీసుకురావాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన దోపిడీలపై పవన్ కూడా నిలదీసి ధర్నాలు చేసిన విషయం నిజం కాదా అన్నారు.
గతంలో ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు ఆడించిన విధంగా పవన్ ఎందుకు ఆడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఎందుకు చంద్రబాబును సీఎంను చేయాలని తపిస్తున్నారో పవన్ స్పష్టం చేయాలన్నారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు ఏపీ ప్రజలు మరచిపోరన్నారు.. వాలంటీర్లపై Human Human Trafficking ఉమన్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసిన పవన్ పై పోలీసులు కూడా Sumoto case సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. 18 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ వారి వివరాలు చెప్పాలని.. లేకుంటే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని ఆయన ఎమ్మెల్యే సుదాకర్ బాబు డిమాండ్ చేశారు.