Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మహిళలు ఏ దుస్తులు వేసుకోవాలో..హెూం మంత్రి చెబుతారా! మహిళలకు బహిరంగ క్షమపణ చెప్పాలి..  తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి డిమాండ్..

0

మహిళలు ఏ దుస్తులు వేసుకోవాలో హెూం మంత్రి చెబుతారా..?రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు పెరుగుతున్నా .. వీటిపై చర్యలు తీసుకోవడం మానేసి,రాష్ట్ర హెూం మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం బాధాకరం అన్నారు రాష్ట్ర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.. ఒక కళాశాలలో తలెత్తిన వివాదం నేపథ్యంపై రాష్ట్ర హోం మంత్రి మహ్మమూద్ అలీ ప్రసంగంలో మహిళలు యూరోపియన్ల తరహాలో పొట్టి దుస్తులు వేసుకుంటే ఇబ్బందని, అలా కురచ దుస్తువులు వేసుకునే మహళలు ఇబ్బందుల పాలవుతున్నారన్న వ్యాఖ్యాలను రాష్ట్ర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి తీవ్రంగా కండించారు.

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఉంటారు.. అలాగే హెూం మంత్రి ఇంట్లోను ఆడవాళ్లు ఉంటారని గుర్తించుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.బాధ్యతాయుతమైన హెూదాలో ఉన్న రాష్ట్ర మంత్రి బాధ్యతను మరిచి మహిళల పై మాట్లాడే మాటలు సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తాయన్నారు. హెూం మంత్రి మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బోడపాటి షేజల్ అనే మహిళా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

 

షేజల్ ఢిల్లీలో మానవ హక్కుల సంఘానికి అలాగే సిబిఐకి ఫిర్యాదు చేశారు.ఆత్మహత్య యత్నం చేశారని ఆమె అన్నారు. తనకు తెలంగాణ రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై విశ్వాసం లేదని స్పష్టం చేశారు. షేజల్ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎందుకు విచారణ జరిపించడం లేదు? అని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.  ప్రభుత్వయంత్రాంగం దృష్టిపెట్టి ఈ లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా వెంటనే  చర్యలు తీసుకోవాలని కోరారు.

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ ఆవిష్కృతం

రాష్ట్రంలో మహిళా అఘాయిత్యాలపై నమోదు అవుతున్న కేసులలో 2 శాతం మాత్రమే న్యాయం జరుగుతున్నది. పోలీసుల అలసత్వం వల్లే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల కేసులలో శిక్షలు పడటం లేదన్నారు.ఇలాంటి వాఖ్యలు చేసే మంత్రులను ముఖ్యమంత్రి నియంత్రించాలని విన్నవించారు. వెంటనే హెూం మంత్రి మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని రాష్ట్ర  తెలుగు మహిళా విభాగం తరపన డిమాండ్ చేస్తున్నాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని మీడియా సమావేశంలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie