Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

Viveka Murder Case: వైఫై రూటర్… కీలకం

CBI court issued summons to YS Avinash Reddy

0

కడప, జూలై 22: సీబీఐ మరోసారి వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన ఆరోపణలు చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు కుట్ర చేశారని సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను కూడా ప్రస్తావించింది. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను కోర్టుకు సమర్పించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది. సాక్ష్యాల చెరిపివేత సమయంలో అక్కడ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదని తెలిపింది. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్ట్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నామని వివరాలు ఇవ్వాలని అధికారులను కోరామని తెలిపింది. వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాలని చెప్పింది. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ రిపోర్టులు త్రివేండ్రం సీడాక్ నుంచి రావాల్సి ఉందని తెలిపింది.

నిందితులు సునీల్ యాద‌వ్‌, ఉద‌య్‌కుమార్‌రెడ్డి క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లోనూ, ఇంటి ప‌రిస‌రాల్లోనూ ఉన్నార‌ని గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్న‌ట్టు తెలిపింది సీబీఐ. ప్రాధమిక చార్జిషీట్ లో పేర్కొన్న అంశాలు తుది చార్జిషీట్ లో మార్పులు చేశామని సీబీఐ తెలిపింది. వివేకానంద‌రెడ్డి ఇంట్లో 2019, మార్చి 14న రాత్రి సునీల్ యాద‌వ్‌ వున్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంట‌ల‌కు వివేకా నివాసం స‌మీపంలో, 2.42 గంట‌ల‌కు నివాసం లోప‌ల ఉన్నాడని.. సునీల్ సెల్ నెంబ‌ర్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించామని సీబీఐ గ‌తంలో పేర్కొంది. తాజాగా తుది నివేదిక‌లో ఇది నిజం కాద‌ని సీబీఐ కోర్టుకు స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో స్ప‌ష్టం చేసింది. వివేకా ఇంట్లో 2019, మార్చి 14 అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత సునీల్ యాద‌వ్ లేడని.. 2019, మార్చి 15న ఉద‌యం 8.05 గంట‌ల‌కు వివేకా ఇంటి బ‌య‌ట‌, 8.12 గంట‌ల‌కు ఇంటిలోప‌ల వున్నాడని తెలిపింది. గ‌తంలో గ్రీన్‌విచ్ కాల‌మానం ప్ర‌కారం గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నాం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాల‌మానం ప్ర‌కారమే చూడాలని, గ‌తంలో స‌మాచార సేక‌ర‌ణ‌లో పొరపాటు జరిగిందని తాజా చార్జిషీట్ లో సీబీఐ పేర్కొంది. వివేకానంద‌రెడ్డి క‌డ‌ప ఎంపీ సీటును ఆశించ‌లేద‌ని వైఎస్ ష‌ర్మిల వాంగ్మూలం ఇచ్చిన‌ట్టు సీబీఐ తెలిపింది.

వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ కోర్టు జులై 14వ తేదీన సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని వైకాపా ఎంపి అవినాష్ రెడ్డికి సమన్లు పంపింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ ను సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి,ఉదయ్ కుమార్ రెడ్డిపై ఛార్జిషీట్ వేసింది. వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా సిబిఐ అవినాష్ రెడ్డిని చేర్చింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు చేసిన కుట్రలో నిందితుల పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ దాఖలుచేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. హత్యకు డబ్బు సమకూర్చిందెవరో తేలాల్సి ఉందన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ కేసులో సీబీఐ కోర్టుకు అనుబంధ అభియోగపత్రం సమర్పించింది. ఇందులో A-6గా ఉదయ్‌కుమార్‌రెడ్డి, A-7గా వై.ఎస్‌.భాస్కరరెడ్డి, A-8గా వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిలను పేర్కొంది.

వివేకా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎం.వి.కృష్ణారెడ్డి, వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాష్‌లను ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసినా.. ఇంకా దర్యాప్తు కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వివేకా చనిపోయే ముందు రాసిన లేఖలో వేలిముద్రలు, చేతి రాతను గుర్తించడంలో భాగంగా లేఖను కోర్టు నుంచి సీబీఐ తీసుకుని, దిల్లీ ఎఫ్ఎస్ఎల్కు పంపింది. నిన్‌హైడ్రిన్‌ పరీక్ష ద్వారా వేలిముద్రలను గుర్తించాలని కోరింది. ఎం.వి.కృష్ణారెడ్డి, వంటమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాష్‌ను అనుమానితులుగా పేర్కొంది. వీటన్నింటిపై స్పష్టత నిమిత్తం దర్యాప్తును మరికొంతకాలం కొనసాగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి విజ్ఞప్తిని కోర్టులకు చేయలేదు. గడువు సుప్రీంకోర్టే నిర్ణయించినందున.. అదనపు గడువు కోసం కూడా ఆ కోర్టు దగ్గరే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. కానీ సీబీఐ ఇప్పుడు తుది ఛార్జిషీటును మార్చడంతో మొత్తం విషయం అంతా మారిపోయింది.

courtesy: (న్యూస్ పల్స్)

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie