Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

స్థానికులతో కలిసి ట్రాఫిక్ స్తంభింప చేస్తాం

We will stop the traffic together with the locals

0
  • ఫ్లైఓవర్ పై రోడ్డు నిర్మాణ పనుల జరపని ప్రభుత్వ నిర్లక్ష్యానికి నల్ల జెండాలతో
    సిపిఐ నిరసన
  • ప్రజల ప్రాణాలు కోసం ట్రాఫిక్ స్తంభింప చేస్తాం సిపిఐ హెచ్చరిక.
  • సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు

నిత్యం ప్రమాదాలకు నిలయంగా ఉన్న చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ పై రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే, స్థానికులతో కలిసి ట్రాఫిక్ స్తంభింప చేస్తామని సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు హెచ్చరించారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం మిల్క్ ప్రాజెక్టు, చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టని కారణంగా నల్ల జెండాలు చేతబూని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కోటేశ్వరావు సివిఆర్ ఫ్లైఓవర్ పై రోడ్లు వేసి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ, ఏడో తారీఖున ధర్నా చేసి, అనంతరం ఆర్ అండ్ బి అధికారీ డిప్యూటీ సూపర్డెంట్ వెంకన్న దొరకు, స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ శ్రీ ఢిల్లీ రావుగారికి వినతి పత్రాలు సమర్పించినా, స్పందన లేని స్పందనలో ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి 10 రోజులైనా పనులు ప్రారంభించకపోవడం ఆవేదన కలిగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 437 రోడ్లకు బాగు చేసేందుకు 3,432 కోట్ల రూపాయలు నిధులు ఏమైనట్టు అని ప్రశ్నించారు. ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి, ఆచరణ గడప దాటలేదని, ఇందుకు నిదర్శనం చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ పైన రోడ్లు యొక్క గుంతలు చూస్తే అందరికీ ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం అన్నారు.

గత కొన్ని రోజులు క్రితం భార్య భర్తలు వాహనం మీద వెళుతుంటే గోతిలో పడి వాహనం పడిపోగా భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయని, అనంతరం రెండో రోజు ఉదయం వీరీ కుటుంబ సభ్యులు పిల్లలతో సహా వచ్చి ఆ గోతిలో మట్టిని పూడ్చి ఉపశమనం కలిగించారని ఈ సంఘటనను ప్రభుత్వ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లామని, అలాగే భీముని వారి పేటకు చెందిన నర్రా శ్రీనివాసరావు సైకిల్ పై వెళుతూ గోతిలో పడి ప్రమాదానికి గురవటంతో తుంటి ఎముక విరిగి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవటం జరిగిందని గుర్తుచేశారు. నిత్యం ఫ్లైఓవర్ మైలవరం, షాబాద్, జక్కంపూడి వైపుల నుండి, నున్న వైపు నుంచి వచ్చే వాహనాలతో రద్దీగా ఉండటం, రాత్రిపూట లైట్లు వెలుతురు తక్కువగా ఉండి చీకటమయంతో ఉండటం, గత నాలుగు రోజులుగా వర్షాలు పడటం వలన గోతులలో నీరు వుండి కనపడక అనేక ప్రమాదాలకు నిలయంగా మారిందని ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ ఫై ఓవర్ సమస్యపై ప్రజాప్రతినిధులు, (ఎమ్మెల్యేలు) ఆర్ అండ్ బి అధికారులు స్పందించకపోతే, ప్రజల ప్రాణాలు సంక్షేమమే మాకు ముఖ్యమన్నారు, సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలకు సమయతమవుతామని, స్థానిక ప్రజలను సమీకరించి ట్రాఫిక్ ను స్తంభింప చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడయ్య, పంచదార్ల దుర్గాంబ, కార్యవర్గ సభ్యులు డి.వి రమణబాబు, కొట్టు రమణారావు, తూనం వీరయ్య, కార్యదర్శులు, ఉప్పలపాటి శివప్రసాద రాజు, బియ్యపు కృష్ణారావు, దాసిన నారాయణరావు, బొరా రామకృష్ణ, ఆటో యూనియన్ నాయకులు గూడేల జనార్ధన్, శీలం సోమేశ్వరరావు, కుర్ర శివకుమార్, ఆర్ మైకేల్, ఎస్వీ.రమణ, పి రాము, టి.పూర్ణయ్య, చింతాడ పార్వతి, ఆర్. శ్రీనివాసు, దుర్గాసి రమణమ్మ, మురుగేషన్ రాము, ఆర్ అనసూయ, సింగరాజు సాంబశివరావు, బి. ఝాన్సీ లక్ష్మి, రాయన గురునాథం, యువజన నాయకులు కే భార్గవ, బి శివకృష్ణ, పి రూపేష్ కుమార్, ఎ సూరిబాబు, దాసరి రంగారావు, కే పండు, టీ వెంకటేశ్వరరావు, అప్పారావు, జిరా లాజరు, రాత్ర శేఖర్, కె వెంకటేశ్వరరావు, రామస్వామి, అప్పాయమ్మ, మారుతి, గుజ్జారి అప్పారావు, తమ్మిన రాము, చిన్న, సత్యాల రాము, వీరాంజనేయులు, ఆటో రంగ కార్మికులు, యువజన, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie