Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పరిపాలనను ప్రతి ఇంటికి తెలియజేస్తాం -బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి..

0

బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పరిపాలనను ప్రతి ఇంటికి తెలియజేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సూపరిపాలన  విజయవంతగా 9 సంవత్సరలు పూర్తి చేసుకున్న సందర్బంగా మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా గురువారం  పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముత్యాలమ్మ వాడ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఇంటి ఇంటికి బీజేపీకార్యక్రమం పాల్గొని  గడప గడపకు తిరుగుతూ, బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకలను ప్రజలకు వివరించారు.

 

అనంతరం ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా మన ప్రధాని మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నరన్నారు, కాంగ్రెస్ పాలనలో చేయలేని సంక్షేమలను మోడీ  పాలన చేసి చూపిస్తుందన్నారు, నేడు ప్రపంచ దేశాలకు భారత దేశం ఒక మార్గదర్శిగా మోదీ   అభివృద్ధి చేశారని, కరోన తో  ప్రపంచం మొత్తం అల్లాడి పోతున్న తరుణం లో ఉచితంగా టీకాలు ఇచ్చి కోట్లాది ప్రజలకు ప్రాణధాత గా నిలిచాడన్నారు. ఉచిత రేషన్ తో పెద ప్రజల కడుపునింపుతున్నాదాని,బీజేపీ అధికారం లో ఉన్న రాష్ట్రలు ఎంతగానో అభివృద్ధి చెందతున్నాయన్నారు.

జో బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ, రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు..

కెసిఆర్ పాలనలో ధనిక రాష్ట్రన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడన్నారు, రానున్న రోజుల్లో తెలంగాణ లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని, కేంద్రంలో మళ్ళీ బీజేపీ దే అధికారం అన్నారు..ఈకార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, సీనియర్ నాయకులు  కొండపాక సత్య ప్రకాష్,బోగోజు శ్రీనివాస్, ఎడ్ల సదశివ్, పట్టణ ఉప అధ్యక్షులు దాసరి శ్రవణ్, ఎస్ స్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు కాసర్ల సూర్య,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు, పట్టణ కార్యదర్శి ఆకుల అరుణ్, సోషల్ మీడియా కో కన్వినర్ తడూరి రవి, యువ నాయకులు ఎడ్ల సాగర్, విరుగుర్రాల శేఖర్, లక్ష్మణ్, శివ, వేణు, రాజకుమార్, ప్రశాంత్, శేఖర్, నరేష్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie