Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పదివేలమందితో సిఎం కేసిఆర్ పర్యటన అడ్డుకుంటాం

We will block CM KCR's visit with ten thousand people

0

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం పథకాల పేరిట తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపర్చుస్తున్నారని డీసీసీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆరోపించారు. మెదక్ లో సీఎం పర్యటన 10 వేల మందితో అడ్డుకుంటామని హెచ్చరించారు. బుధవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటై సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఆయన ఎద్దేవ చేశారు. 2018 ఎన్నికల్లో ఇదే గడ్డమీద నుండి మెదక్ జిల్లాను అభివృధ్ది చేసుకునేది చాలా ఉందని ప్రగల్భాలు చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్ ఏం అభివృద్ధి జరిగిందో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలోని పలుశాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలను సిద్ధిపేటకు తరలించడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.

Also Read:

యాదాద్రి నర్సింహ్మ స్వామి దేవాలయం మాదిరిగా ఏడుపాయల దుర్గమ్మ దేవస్థానంను ఎందుకోసం చేయలేదని ఆయన ప్రశ్నించారు. మెదక్ ప్రాంతం మీద, మెదక్ జిల్లా వాసుల మీద ఎందుకు సిఎం కేసిఆర్ కు వివక్ష అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2024 లో నిజాంషుగర్స్ చక్కెర కర్మాగారాన్ని తిరిగి నడిపిస్తామని, ఆ చక్కెర కర్మాగారంలో పని చేసిన కార్మికులందరిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, ప్రభాకర్ రెడ్డి, పల్లె రాంచందర్ గౌడ్, కౌన్సిలర్ లు దాయర లింగం, ఆవారి శేఖర్, ఎస్సి సెల్ రాష్ర్ట నాయకులు శ్యాం సుందర్, గోవింద్ నాయక్, శంకర్, మెదక్ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు,శ్యాం రెడ్డి, రాంరెడ్డి, యాదగిరి, భాను, సతీష్, పద్మ మనోజ్ కుమార్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie