న్యూఢిల్లీ ఫిబ్రవరి 8
కస్టడీలో ఉన్న మహిళలకు కన్యత్వ పరీక్షలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో అయినా, పోలీస్ కస్టడీలో అయినా ఇలాంటి ఘటనలు అమానవీయమని, మహిళల గౌరవానికి భంగకరమని వ్యాఖ్యానించింది. కన్యత్వ పరీక్షలు నిర్వహించడానికి చట్టపరంగా ఎలాంటి అనుమతులు లేవని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ మంగళవారం తీర్పు వెలువరించారు.1992 మార్చి 27న సిస్టర్ అభయ అనే మహిళ మరణించింది.
బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో 2020లో సిస్టిర్ సెఫీని కేసులో దోషిగా నిర్ధారించింది. కోర్టులో నేరాన్ని రుజువు చేయడం కోసం 2008 నవంబర్ 25న సెఫీకి కన్యత్వ పరీక్షలు చేయించింది.అయితే, సీబీఐ తనకు కన్యత్వ పరీక్షలు చేయించడాన్ని సవాల్ చూస్తే ఇటీవల సిస్టర్ సెఫీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విచారణ జరిపిన న్యాయస్థానం తాజా తీర్పును వెల్లడించింది.