నౌపడ పంచాయతీలో ఉపాధి హామీ పథకం లో జరిగిన అవినీతి అక్రమాలు పాల్పపడడంతో నౌపడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసలు ఇచ్చిన వారికే క్షేత్ర సహాయకులు పనులు కల్పిస్తున్నారని వేలాది నౌపడ కార్మికులు ఉపాధి కల్పించుకోకపోవడంపై ఆందోళన చేశారు. అనంతరం నౌపడ గ్రామ సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. క్షేత్రసహాయకులను నిర్బంధించారు. దాంతో వారు తప్పించుకున్నారు. క్షేత్ర సహాయకులు బొమ్మాళి రామారావు, నీలాపు ప్రసాద్ రెడ్డి లను పరుగులు పెట్టి వెంబడించారు. అనతరం సచివాలయం వద్ద ఆందోళన చేపెట్టారు.