ఏజెన్సీ లో రోగిని జోలె కట్టి వాగు దాటిస్తున్న గ్రామస్తులు
Villagers crossing the stream with a rope tied to the patient in the agency
ఏజెన్సీలో వైద్యం అందక ఒకరుమృతి ,మరొకరి పరిస్థితి సీరియస్,— జిన్నెల వాగుకు వరదపెరగడంతో జోల కట్టి వాగుదాటించిన గ్రామస్తులు ముద్ర, వెంకటాపురం (నూ): ములుగు జిల్లా వెంకటాపురం మండలం భోదాపురం పంచాయతీలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కురసం బాబురావు వాంతులు, విరోచనాలతో గురువారం మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన లక్ష్మయ్య వాంతులు, విరోచనాల కారణంతో ఇబ్బంది పడుతున్నాడు.
లక్ష్మయ్యను అత్యవసర వైద్యం కోసం ఎదిరలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నాలుగు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా సీతారాంపురం నుండి అలుబాక మధ్యలో ఉన్న జిన్నెలవాగు పొంగిపొర్లుతునది.వాగు వరకు ఎలాగోలా లక్ష్మయ్యను తరలించిన గ్రామస్థులు ఒక కర్రకు జోలీ కట్టి అందులో లక్ష్మయ్యను ఉంచి గ్రామస్తులు అంత వాగు దాటించారు. సీతారాంపురం గిరిజన గ్రామంలో ఇంటి కొకరు జ్వర పిడితులు ఉన్నట్లు గ్రామ స్థులు చెబుతున్నారు.