- పట్టించుకోని అధికారులు
- వందల ఎకరాల్లో పంట నష్టం
- టెన్షన్ లో జమ్మికుంట మండల ప్రజలు
జమ్మికుంట మండలంలోని విలాసాగర్ చెక్ డ్యాం మానేరు నీటి ఉధృతికి తెగిపోయింది. శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టుకు గండి పడడంతో పాటు, మల్లారెడ్డిపల్లి గ్రామంలోని చెరువు మత్తడి తెగడంతో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీనికి తోడు ఎల్ ఎం డి డ్యాం గేట్లు తెరవడంతో వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహించి చెక్ డ్యామ్ తెగిపోయింది.
దీంతో వందల ఎకరాలు నీట మునగడంతో పాటు, వరి నాట్లు కొట్టుకుపోయాయి. పొలాలపై ఇసుక మేటలు వేసాయి. మానేరు పరివాహక ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏ టైం కు ఏం జరుగుతుందన్న టెన్షన్ లో జమ్మికుంట ప్రజలు బిక్కుబిక్కుమంటూ వెల్లదీస్తున్నారు.