ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు
చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. దీనికోసం యావత్ భారతమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి అపూర్వ ఘట్టం నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్‌ను విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈవోలు, ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. దీనిని విద్యార్థులు, యువత ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడాలని కోరింది. ఈ నేపథ్యంలో టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలు, విద్యా సంస్థల్లో ప్రత్యేక తెరలు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి విద్యార్థులంతా చూసేలా విజ్ఞప్తి చేయనున్నారు.