విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో తెల్లవారుజామునే పాల ప్యాకెట్ దొరకదేమో గాని మద్యం ఏరులై పారుతుంది. జనావాసాల మధ్య అనధికారికంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారు అరికట్టాల్సిన పోలీస్ యంత్రాంగం నిద్రమత్తులో జోగుతుండడంతో నిర్వాహకులకు మూడు పూవులు ఆరు కాయలు లామారింది. కాలనీవాసులకు శాపంగాా పరిణమించింది. తెల్లారి జామునే మద్యం విక్రయాలు జరుగుతుండంతో మందుకు బానిస అయిన వారు అప్పులు చేసి మరీ మద్యం తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు.అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి, రోడ్డు వెంబడి తాగుబోతుల సైర విహారంతో ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు మహిళలు ఆందోళన గురవుతున్నారు..