రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెలిమెడ లక్ష్మీనరసింహారావు ను, పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. దీంతో వేములవాడ నియోజకవర్గంలో చెల్మెడ లక్ష్మీనరసింహారావు అభిమానుల్లో సంతోషం నెలకొంది. సంబరాల్లో మునిగిపోయారు.