వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి గత నెలలో నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగా అల్లు కుటుంబాలకు చెందిన వారంతా వారి బంధుమిత్రులు సన్నిహితులతో ఈ వేడుకకు అటెండయ్యారు. ఇది కేవలం వారు జరిగింది. నిశ్చితార్థం బంధుమిత్రుల సమక్షంలో తర్వాత ఈ జంట పెళ్లి తేదీ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ముగిసిన రెండు రోజులకు అంటే ఆగస్ట్ 24న మెగా వెడ్డింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేసుకుని వెన్యూని ఫైనల్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వధూవరుల కుటుంబ సభ్యులు సహా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఇటలీలో | నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి-అనుష్క శర్మ.. దీపికా పదుకొనే రణ్వీన్ సింగ్ కూడా ఇటలీలో వివాహం చేసుకున్నారు. వరుణ్ – లావణ్య త్రిపారి జోడీ కూడా అక్కడ ఒక్కటికానున్నారా? అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.