మహబూబాబాద్ జిల్లా మరిపెడ విలేజ్ కి చెందిన వడ్డూరి భాగ్యలక్ష్మి (25) మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం నార్మల్ డెలివరీ కి రాగా డాక్టర్ రవి నార్మల్ డెలివరీ చేశారు.గతంలో ఒక బాబు ఉండగా ఇప్పుడు మాగ బిడ్డకు జన్మనిచ్చింది.డెలివరీ సమయంలో చిన్న ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీశారు. బ్లీడింగ్ కంట్రోల్ కాకపోవడంతో ఎమర్జెన్సీ కేసుగా నిర్ధారించి మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి అంబులెన్సులో తరలించారు.అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ నిర్ధారించడంతో మృతురాలి బంధువులు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు.
51 కిలోన్నర అక్రమ బంగారం పట్టివేత.
డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని,కుట్లు సరిగా వేయకపోవడంతో ఓవర్ బ్లీడింగ్ కారణంగానే చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం ఫోన్ చేసిన స్పందించకపోవడంతో మృతురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఖమ్మం వరంగల్ నేషనల్ హైవే మీద బంధువులు డెడ్ బాడీతో ధర్నా చేస్తున్నారు. ఘటనకు కారణమైన డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు అదరపు బలగాలను తెప్పించారు.