హిమాయత్ సాగర్ నుండి కొనసాగుతున్న నీరు విడుదల
గండిపేట్ ఉస్మాన్ సాగర్ జలాశయం రెండు ద్వారాలు ఎత్తి దిగువ కు నీరు ని వదులుతునారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు రెండు ద్వారాలు ఎత్తి దిగువ కు నీరు ని వదులుతునారు. గండిపేట జలాశయంకు ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో మూసీ నదిలోకి నీటిని విడుదల చేసేందుకు ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు తేరిచారు.
ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులకు చేరుకోలేదు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా 1,200 క్యూసెక్కులకు ఇన్‌ఫ్లోలు పెరగగా, ప్రస్తుత నీటిమట్టం 1787.15 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా హిమాయత్ సాగర్ వద్ద హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 1,350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.