యువతలో స్పూర్తిని నింపిన “యూనివర్సిటీ” సినిమా.. నిర్మాత ఆర్. నారాయణమూర్తిని కలిసి అభినందనలు తెలిపిన సాయిబాబా..
హైదరాబాద్ జూన్ 12 (ఎక్స్ ప్రెస్ న్యూ స్);విప్లవకారుడు,సినీ నటుడు,దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తిని తెలుగు రాష్ట్రాల యువ నాయకుడు సాయిబాబా మర్యాదపూర్వకంగా ఆయన స్వగృహంలో కలిసారు. నూతనంగా విడుదల అయిన “యునివర్సిటి” సినిమా అతి పెద్ద విజయం సాధించందం పట్ల సాయిబాబా నారాయణమూర్తి కి అభినందనలు తెలిపారు. యువత జీవితంలో జరిగే పరిస్థితులను, యువత కష్టాలను, క్లుప్తంగా చూపించినందుకు ధన్యవాదములు తెలిపారు. క్రితం లో విప్లవాలు, రైతు కష్టాలనే చూపించిన మీరు “యునివర్సిటి” సినిమాలో యువత కష్టాలను బాగా చూపించారని దీని ద్వార యువతలో స్పూర్తి నింపారని, కొనియాడారు. ఇదే విధంగా ఇంకా యువతపై అనేక సినిమాలు తీసి యువతను పోత్సహించాలని కోరారు. ప్రతి ఒక్క యువత కూడా “యూనివర్సిటీ” సినిమా చూడాలని సాయిబాబా కోరారు..