Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

Union Minister Kishan Reddy visited flood effected areas

0

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

వరద బాధితులు ఎవరు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. వరద ముంపుకు గురైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామాన్ని కిషన్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాలతో దెబ్బతిన్న గ్రామ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చలించి పోయారు. గ్రామ పరిస్థితిపై స్పెషల్ ఆఫీసర్ తో కలిసి కలెక్టర్ భవేశ్ మిశ్రా కేంద్ర మంత్రికి వివరించారు. బురదమయమైన ఇళ్లను, కొట్టుకుపోయి చెట్లకు ఇరుక్కుపోయిన వాహనాలను పరిశీలించారు. ర్యాకం విజయ, నర్సారెడ్డి తో పాటు పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. వాగు ఉప్పొంగిన రోజు ఘటనను, వరదల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు అన్నింటినీ వదిలి పరిగెత్తిన పరిస్థితిని కిషన్ రెడ్డికి గ్రామస్తులు వివరించారు. ఊరు ఊరంతా కొట్టుకుపోయింది.. ఒక్క ఇల్లు కూడా మళ్లీ ఉండేందుకు పనికిరాకుండా పోయిందని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు. గూడు, గొడ్డు అంతా పోయిందంటూ తెలియజేయగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని అండగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు.

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశాలతో తాను ఢిల్లీ నుంచి బయలుదేరి ఈరోజు మోరంచపల్లికి రావడం జరిగిందని, వరద ఉధృతికి గ్రామం మొత్తం అల్లకల్లోలంగా మారిందని వరద బాధితులకు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వరద ఉధృతిలో కొట్టుకుపోయి మృతి చెందిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మూడు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 1లక్ష మొత్తం నాలుగు లక్షలు అందించడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహకారం అందించేందుకుగాను రాష్ట్రంలో 9 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో ప్రకృతి విపత్తి కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక బృందాలు సోమవారం రోజు రానున్నాయని అందులో పూర్తిగా సమాచారం సేకరించి, నివేదికలకు అనుగుణంగా ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు మార్తినేని ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, చందుపట్ల కీర్తి రెడ్డి, కన్నం యుగేందర్, వెన్నంపల్లి పాపయ్య, ఎరుకల గణపతి, బుర్ర వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie