- మైనర్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులపై చట్ట ప్రకారం కేసులు
- జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్
- గడిచిన 8 నెలలో మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై 5432 ఈ- చలన్స్, 12 మంది తల్లిదండ్రులపై కేసులు
జగిత్యాల: మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై, మైనర్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక శ్రద్ధ ఉంచడం జరిగిందని తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనం ఇవ్వకూడదని, వాహనం ఇచ్చినచో వారు తెలిసి తెలియని డ్రైవింగ్ తో వాహనం నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గడిచిన 8 నెలలో మైనర్లు డ్రైవింగ్ చేయడం వలన 3 గురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగిందని అదేవిధంగా ముగ్గురు మైనర్లు సెల్ఫ్ యాక్సిడెంట్స్ అనగా చెట్లకు, డివైడర్లకు గుద్దుకుని చనిపోవడం జరిగిందని అదేవిధంగా మైనర్ లు డ్రైవ్ చేయడం వల్ల 16 మంది వ్యక్తులు తీవ్ర గాయాలు కావడం జరిగిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని మైనర్ డ్రైవింగ్ కఠినంగా వ్యవహరిస్తున్నామని ఇందులో భాగంగానే 12 మంది తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని, మైనర్ డ్రైవింగ్ కి సంబంధించి 5432 ఈ- చాలన్ కేసులు కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమే కావున ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని వాహనాలు ఇచ్చి వారిని ప్రోత్సహించవద్దని తల్లిదండ్రులకు ఎస్పీ సూచించారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే కుటుంబం జీవితాంతం బాధపడే బాధపడే వలసి వస్తుందని పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు.మైనర్ డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు గురించి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో స్కూల్, కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనల, మైనర్ డ్రైవింగ్ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
District SP Eggadi Bhaskar, minors driving, minor children, Legal cases against parents, vehicles to minors