హైదరాబాద్, ఫిబ్రవరి 10: ట్విట్టర్ తన యూజర్లకోసం ప్రీమియం సబ్‍స్క్రిప్షన్ సర్వీస్ను మన దేశంలో అందుబాటులోకి తెచ్చింది. ప్రొఫైల్కు బ్లూ టిక్ మార్క్ను పొందే వెసులుబాటును కల్పిస్తోంది. అందుకు మొబైల్ యూజర్లు నెలకు రూ.900, వెబ్ యూజర్లు రూ.650 చొప్పున సబ్‍స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గురువారం స్పష్టం చేసింది. నెలవారీతో పాటు వార్షిక ప్లాన్‌నూ అందుబాటులోకి తెచ్చింది. ఒకేసారి ఏడాది సబ్‍స్క్రిప్షన్ తీసుకున్నోళ్లు రూ.6,800 చెల్లించాలని చెప్పింది. సబ్‍స్క్రిప్షన్ తీసుకున్నోళ్లకు.. ప్రొఫైల్కు బ్లూ టిక్ మార్క్ తో పాటు ట్వీట్లను ఎడిట్ చేసుకునే ఆప్షన్, ఎక్కువ సైజ్, టైమ్ ఉన్న వీడియోలు పోస్ట్ చేయడం, బుక్ మార్క్ ఆర్గనైజింగ్, కస్టమ్ యాప్ ఐకాన్స్, ఎన్ఎఫ్‍టీలను ప్రొఫైల్ పిక్చర్లుగా మార్చుకునే ఫీచర్లను అందించనుంది.
ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. అమెరికాలో ఇదే టిక్ మార్క్ సబ్స్క్రిప్షన్ కావాలంటే ఆండ్రాయిడ్, ఐవోఎస్ లకు నెలకు 11 డాలర్లు, వెబ్‌లో 8డాలర్లుగా ట్విట్టర్ నిర్ణయించింది. అక్కడ వార్షిక సభ్యత్వానికి 84 డాలర్లుగా ఫిక్స్ చేసింది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, యూకే, సౌదీ, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోర్గల్, స్పెయిన్, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనూ బ్లూ టిక్ అందుబాటులో ఉందని ట్విట్టర్ ప్రకటించింది. ఇంతకుముందు వరకు సెలబ్రిటీలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, ప్రముఖులు, మీడియా సంస్థలకే బ్లూ ట్లిక్ ఉండేది. కానీ టెస్లా బాస్ ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక రూల్స్ మార్చారు. సబ్స్క్రైబ్ చేస్కున్నోళ్లందరికీ బ్లూ టిక్ కేటాయిస్తానని ప్రకటించారు. దీంతో పాటు పోస్ట్ చేసిన మెసేజ్లను ఎడిట్ చేసుకునేలా ఎడిట్ ట్వీట్ ఆప్షన్ కూడా ఇస్తామని స్పష్టం చేశారు. బ్లూ టిక్ సబ్‍స్క్రిప్షన్ తీసుకోవాలంటే మాత్రం ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి కనీసం 90 రోజులై ఉండాలని కంపెనీ స్పష్టం చేసింది.
బ్లూ టిక్తో బెనిఫిట్లు..
యాడ్స్ తగ్గుతయ్..
మన పేరిట ఫేక్ అకౌంట్లు తగ్గే చాన్స్
పెద్ద సైజ్ మెసేజ్లు, వీడియోలు పోస్ట్ చేస్కోవచ్చు
ట్వీట్ను ఐదుసార్లు ఎడిట్ చేసుకునే ఆప్షన్