Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రియల్ పుష్ప సీన్..

0

పుష్పా సినిమాను పూర్తిగా మరిపించే రియల్ సీన్.. ఫైనాన్స్ వ్యాపారులను బురిడీ కొట్టించి అటవీశాఖ అధికారులు, పోలీసులను షాక్ కు గురిచేసిన స్మగ్లర్లు.. ట్విన్స్ వాహనాలు నెంబర్ ప్లేట్ తో సహా వెహికిల్ లోని ప్రతీ పార్ట్ సేమ్ టూ సేమ్.. మనుషుల్లో ట్విన్స్ ని చూస్తుంటాం.. కవలలంటే ఒకే పోలికతో, ఒకే రంగురూపుతో ఉండటం కామన్ కానీ కవల వాహనాలను ఎక్కడైనా చూశారా..? అసలు ఒకే నెంబర్ తో.. అచ్చు గుద్దినట్లు ఒకే మోడల్ తో వాహనం నడవడం సాధ్యమేనా..? అలాంటి సీన్ ఎక్కడైనా చూశారా..? పుష్ప సినిమాను మై మరిపించే రియల్ సీన్ ఇది మహబూబాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారులు, పోలీసులు అవాక్కైనా రియల్ సీన్ ఇది ఫైనాన్స్ కంపెనీ అధికారులు నోరెళ్ళబెట్టిన హైటెక్ స్కామ్ ఇది కలప స్మగ్లర్లు అటవీశాఖ అధికారులకు ఊహించిన షాక్ ఇచ్చారు.

TS26 TA 0748 నెంబర్ గల ఒక గూడ్స్ వాహనంలో టేకు కలప తరలిస్తుండగా వారం రోజుల క్రితం కొత్తగూడ అటవీశాఖ అధికారులు ఆ వాహనాన్ని సీజ్ చేశారు. అందులో తరలిస్తున్న టేకు కలప విలువ రెండు లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు..సోమవారం సాయంత్రం అదే ప్రాంతంలో అచ్చు గుద్దినట్లు అలాంటి ట్రాలీ వాహనమే మరొకటి కనిపించింది.. సీజ్ అయిన వాహనం ఎలా రోడ్డు పైకి వచ్చిందని షాకైన అటవీశాఖ అధికారులు ఆ వాహనాన్ని వెంబడించారు.. ఆ వాహనాన్ని చేజ్ చేసి పట్టుకున్న అటవీశాఖ అధికారులు అందులో కూడా టేకు కలపను చూసి షాక్ అయ్యారు.

అటవీశాఖ అధికారులు సీజ్ చేసిన రెండో ట్రాలీ ఆటోను కూడా అదుపులోకి తీసుకొని కొత్తగూడ అటవీశాఖ రేంజ్ అధికారి కార్యాలయానికి తరలించారు.. అక్కడికి వెళ్లిన తర్వాత కవల పిల్లలను తలపించేలా కనిపించిన రెండు వాహనాలను చూసి అవాక్కయ్యారు. రెండు వాహనాల నెంబర్లు సేమ్ టూ సేమ్TS 26TA 0748 రెండు వాహనాల ఓనర్ ఒక్కరే.. ఈ రెండు వాహనాలను అచ్చు గుద్దినట్లు మాడిఫై చేసి అటవీశాఖ అధికారులను, పోలీసులను రవాణాశాఖ అధికారులను, ఇటు ఫైనాన్స్ ఇచ్చిన సంస్థలను తన హైటెక్ బ్రెన్ తో బురిడి కొట్టించారు ..వాహనాలు సీజ్ చేసిన తర్వాత వాటిని మాడిఫై చేసిన తీరుచూసి అటవీశాఖ అధికారులు కంగుతున్నారు. కావాలంటే మీరు పరిశీలించండి ఈ కవల ట్రాలీ వాహనాల్లో తేడాలను వాహనాలకు ముందు ఏర్పాటు చేసిన బంపర్లలో రెండు సైడ్లు ఒకదానికి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ మరో మరో వాహనానికి రెడ్ కలర్ ఫ్లవర్ వుంటుంది.. ఒక ట్రాలీ కి ముందు భాగంలో హెవీ సౌండ్ హారన్ కనిపిస్తుంది. మరో వాహనానికి ఎలాంటివి ఏవీ లేవు…రెండు ట్రాలీలో కనిపిస్తున్న చిన్న చిన్న వాహనాలలో తేడాలు, కలర్ చేంజ్ ని కనిపెట్టి అటవీశాఖ అధికారులు ఈ వాహనాలను సీజ్ చేశారు. అతి ముఖ్యంగా రెండు ట్రాలీ ఆటోలకు ఒకే నెంబర్ ప్లేట్ వాడుతున్నారు.

ఇందులో ఒకటి దొంగ వాహనం.. ఒకటి ఒరిజినల్ అని గుర్తించారు..ఐతే దొంగిలించిన వాహనం ఎక్కడిది.? ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ ఇలా ఓకే నెంబర్ తో సేమ్ టు సేమ్ డిజైన్ చేసి నడుపుతున్నారు.. దానిపైన విచారణ జరుపుతున్నారు.. ఈ రెండు వాహనాలేనా..? ఇంకా ఇలాంటి డబల్ నెంబర్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇలాంటి వాహనాలు నడుపుతున్నారని ఆరా తీస్తున్నారు. ఈ వాహనాల్లో కలప తో, పాటు పిడిఎస్ రైస్ ఇతర స్మగ్లింగ్ గూడ్స్ రవాణా చేస్తున్నట్లుగా ఇప్పటికే గుర్తించారుపోలీసులు, రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా విచారణ చేపట్టారు.

ఆ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలో దింపారు ఇప్పటివరకు ఎన్ని వాహనాలు దొంగిలించారు..! అవి ఎక్కడెక్కడ నడుపుతున్నారు టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా. స్మగ్లర్లు ఇలా హైటెక్ బ్రెయిన్ తో అధికారులను బురిడీ కొట్టించడం ఇప్పుడు హాట్ హాట్ చర్చగా మారింది ఒకే నెంబర్ ప్లేట్ తో ఒకే టైప్ వాహనాలు తయారుచేసి దర్జాగా నడపడం పట్ల రవాణాశాఖ అధికారులు, పోలీసుల నిఘా వైఫల్యాన్ని వేలెత్తి చూపించింది దీన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు రవాణా శాఖ అధికారులు మరింత లోతుగా విచారణ జరిపితే మరిన్ని వాహనాలు దొరికే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie