రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పన్నెండుమంది మృతి చెందా.
కడప జిల్లా కొండాపురం మండలం పి.అనంతపురం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ, తుఫాన్ వాహనం ఢీకొన్నాయి. ఆరుగురు మృతి చెందగా , మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. తాడిపత్రి, బళ్ళారికి చెంచిన వారు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది.
కాకినాడ జిల్లా తాళ్ళరేవు తాళ్ళరేవు బైపాస్ వద్ద మరో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను బస్సు ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలు ఘటనాస్దలంలోనే మృతి చెందారు. వీరంతా రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో పనిచేసే మహిళలు.
Next Post