టెక్కలి
జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపడుతున్న యువగళం పాదయాత్ర వైకాపా వెన్నులో వణుకు పుట్టిస్తోందని రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు.
మంగళవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2019 తన ఎన్నికల హామీల్లో యువతకు పెద్దపీట చేస్తానని నమ్మించి గద్దెనెక్కిన తరువాత నిరుద్యోగ యువతను వంచించడంతో వారంతా తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్నారన్నారు.
యువతకు భరోసా కల్పించేందుకు ఈనెల 27న ప్రారంభమైన యాత్రను చూసి జగన్మోహన్ రెడ్డి సైకోలా మారి రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అన్నారు. నెంబర్ ఒకటిని ప్రవేశపెట్టి పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా డని మండిపడ్డారు. లోకేష్ బాబుకు భద్రత కల్పించడంలో పోలీసులపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనుకకు తీసుకున్నానని వివరించారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి టీడీపీ విజయం సాధించే దిశగా ముందుకు సాగుతామన్నారు.