ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం మల్టీ సిటీ జర్నీ కి వీలుగా రిజర్వేషన్ సౌకర్యాన్ని తీసుకొస్తోంది. ఒకే టికెట్ తీసుకుని రెండు బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని 137 మార్గాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే బస్సు మారేందుకు 2 గంటల నుంచి 22 గంటల గడువు ఉంటుంది.ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొందరు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. వారు నేరుగా బస్సు లేకపోతే మధ్యలో వేరొక చోట (నగరం, పట్టణం)లో బస్సు మారాల్సి వస్తోంది. అలాంటి వారికి ఇబ్బంది
లేకుండా తమ ప్రయాణానికి సంబంధించి బస్సు మారినా సరే ఒకే టికెట్ తీసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. సరికొత్తగా ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ పేరిట ఆర్టీసీ రూపొందించింది.ఓ ప్రయాణికుడు అనంతపురం నుంచి శ్రీకాకుళం వెళ్లాలంటే నేరుగా వెళ్లేందుకు అవకాశం లేదు. నేరుగా బస్సు ఉండదు కాబట్టి అనంతపురం నుంచి విజయవాడ వెళ్లి.. అక్కడ మరో బస్సు మారి శ్రీకాకుళం వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు అనంతపురంలో, విజయవాడలో రెండు టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆర్టీసీ తీసుకొచ్చిన కొత్త విధానంలో.. అనంతపురం నుంచి విజయవాడకు ఒక బస్సులో వచ్చి.. మళ్లీ విజయవాడ నుంచి శ్రీకాకుళంకు మరో బస్సు సర్వీసులో వెళ్లొచ్చు.అంటే బస్సు మారినా సరే ఒకే టికెట్‌లో రిజర్వేషన్ చేసుకోవచ్చు.
ఇలా రెండు బస్సుల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేసుకున్నా.. రిజర్వేషన్ ఛార్జి ఒక్కసారి మాత్రమే తీసుకుంటారు. ప్రయాణికులు ఒక బస్సులో బయల్దేరి.. మరొక చోట బస్సులోకి మారేందుకు 2 నుంచి 22 గంటల గడువు ఇచ్చింది ఆర్టీసీ. ప్రయాణికులు ఆ సమయాల్లో ఉన్న సర్వీసులను బట్టి ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఏపీఎస్ ఆర్టీసీ మొత్తంగా 137 మార్గాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. యూటీఎస్ మొబైల్ యాప్, ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈ రిజర్వేషన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దేశంలో తొలిసారి ఆర్టీసీల్లో.. ఏపీలో మాత్రమే ఈ విధానం తొలిసారి అమలు చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానం ప్రారంభించనున్నారు.
నందవరం లో వర్గపోరు మధ్య సాగిన లోకేష్ పాదయాత్ర
ఈ విధానం ముఖ్యంగా విమాన ప్రయాణికులకు బాగా ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.ఏపీఎస్ ఆర్టీసీ తొలి విడతలో ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే ఈ కొత్త విధానం అమలు చేస్తోంది. ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి మిగిలిన రూట్లకు కూడా ఈ విధానాన్ని విస్తరించనున్నారు. ఆర్టీసీ ఇప్పటికే పలు కొత్త పథకాలు, ఆఫర్లతో ప్రయాణికులకు దగ్గరవుతోంది. ఇప్పుడు ఈ సరికొత్త విధానంతో మరింత దగ్గరవుతామని భావిస్తోంది. ఆర్టీసీ ఇప్పటికే నగదు రహిత లావాదేవీలను కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సరికొత్త విధానంతో ప్రయాణికులకు చేరువ అవుతోంది.