సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెంతండలోని ఓ పెళ్లి వేడుకలో గత రాత్రి విషాదం నెలకొంది. పెళ్లి కుమార్తెతోపాటు కారులో కూర్చొని పెళ్లి బరాత్ చూస్తున్న బాణోత్ ఇంద్రజ(9) ప్రమాదవశాత్తూ మృతి చెందింది. కారు ఆద్దాలు తెరిచి డాన్స్ చూస్తుండగా డ్రైవర్ అనుకోకుండా గ్లాస్ బటన్ నొక్కడంతో డోర్ ఫ్రేం, గ్లాస్ మధ్య చిన్నారి ఇంద్రజ మెడ పడి ఊపిరి ఆడక మృతి చెందింది. చిన్నారి మృతి తో తండా వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. డ్రైవర్ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని బంధువుల ఆరోపించారు.