తాడేపల్లిగూడెం
పొలం పనులు చేసుకోవడానికి కూలి పనులకు వెళ్తున్న మహిళలు ట్రాక్టర్ బోల్తా ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం రూరల్ మండలం, మాధవరంలోని కోతి గుంట చెరువు గట్టున సోమవారం అప్పారావు పేట గ్రామం నుండి మాధవరం వ్యవసాయ పనులు కు ట్రాక్టర్ ట్రక్కులో వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో అదుపు తప్పిన ట్రాక్టర్ కోతిగుంట చెరువులో పడిపోయింది.
ఆ సమయంలో ట్రక్కులో మొత్తం పది మంది కూలీలు ఉన్నారు. కాగా ఇద్దరు మహిళా కూలీలు భారతి, ఆకుమర్టి సుజాత సంఘటన స్థలంలో మృతి చెందారు.డ్రైవర్ మరియూ ట్రాక్టర్ ఓనర్ కొచ్చర్ల రాముకి తీవ్రగాయాలయ్యాయి. ట్రక్కులో మిగిలిన ఎనిమిది మందికి స్వల్ప గాయాలు కావడంతో తాడేపల్లగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలని కూడా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.