ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ తో సహా మరో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని పర్సాయిపల్లి గ్రామంలో జరిగింది ఈ సంఘటనలో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ తో పాటు పొలం దున్నించుకునే రైతు కూడా మృతి చెందడం గమనార్హం . బొల్లేపల్లి గ్రామానికి చెందినట్రాక్టర్ డ్రైవర్ పసుల రామలింగయ్య (48) పొలం దున్నుటకు గానున్ కిరాయికి పర్సాయి పెళ్లికి చెందిన రైతు మిడతపల్లి మల్లయ్య (60) పొలం వద్దకు వచ్చి ఉదయం నుంచి పొలం దున్నుతున్నాడు ఈ క్రమంలో డ్రైవర్ రామలింగయ్యకు ఫిట్స్ రావడంతో ట్రాక్టర్ అదుపుతప్పి వెళుతూ పక్కనే పొలం దున్నటాన్ని చూస్తున్న రైతు మల్లయ్య పై కూడా వెళ్లడంతో ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ రామలింగయ్య రైతు మల్లయ్యలు అక్కడికక్కడే చనిపోయారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.