కేసీఆర్ కుటుబం స్వార్థానికి హైదరాబాద్ నగరాన్ని బలి చేస్తారా? అని ప్రశ్నించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నేను చేసేవి రాజకీయ విమర్శలు కాదు. …నగర్ భవిష్యత్తు కోసమే నా తపన. డీ9 (దావూద్9) గ్యాంగ్ రాష్ట్రాన్ని దోచేస్తోంది. ఎవరినీ వదిలేది లేదు. తెలంగాణకు తలమానికం కేబీఆర్ పార్కు. ఆ పార్కులో నెమళ్ళతోపాటు ఎన్నో వన్యజీవులున్నాయి. ఆ పార్కు దగ్గర భారీ హోటల్ నిర్మణానికి అనుమతించారు.
భారీ కట్టడాలతో పర్యావరణం, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదం. కేబీఆర్ పార్కును కాంగ్రెసు ప్రభుత్వం వారసత్వ సంపదగా గుర్తించింది. 2006లో ఫైవ్ స్టార్ హోటల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించింది. 3 అంతస్తుల నిర్మాణం కోసమే అనుమతి ఇచ్చింది. నవాబుల బంగ్లా కూల్చడానికి ఎందుకు అనుమతి ఇచ్చారు. అక్రమ నిర్మాణాలు పక్షుల జాతికి ప్రమాదకరంగా మారనున్నాయి. కేటీఆర్, అతని తండ్రి కలిసి ఇంత విధ్వంసం చేస్తారా? అని విమర్శించారు.