జూన్ 17న భూపాలపల్లి జిల్లాలో గిరిజన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని, దానికి అవసరమైన ఏర్పాటు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన
అధికారులను ఆదేశించారు .శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో గిరిజన భవన నిర్మాణానికి కేటాయించిన ఎకరం స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్
17న నిర్వహించు గిరిజన ఉత్సవ కార్యక్రమం సందర్భంగా గిరిజన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని, భూపాలపల్లి లో గిరిజన భవన నిర్మాణానికి ప్రభుత్వం కృష్ణ కాలనీలో
సర్వే నెంబరు 252 లో ఒక ఎకరా స్థలం కేటాయించిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని చదును చేయాలని, ఎత్తు పళ్ళాలు లేకుండా మట్టి పోయాలని కలెక్టర్ సూచించారు. గిరిజన
భువన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం అక్కడే గిరిజన నాయకులు, ఉద్యోగులు , ప్రజలు దాదాపు 600 మందితో నిర్వహించడం జరుగుతుందని దానికి అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు
చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ డిప్యూటీ సి.ఈ. ఓ. రఘువరన్, భూపాలపల్లి తాసిల్దార్ ఇక్బాల్ సింగరేణి అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.