మేడ్చల్: ఒక లారీ బొలెరో కారు డికొని ముగ్గురు మరణించిన సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని Outer Ring Road ఔటర్ రింగ్ రోడ్డు పై చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ పోలీసులు ORR Patrol Police తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ నుండి కీసర వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ పైనుండి ఎగిరి ఎదురుగా వస్తున్న బొలెరో కారును డి కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికకడే మృతి చందరు. బొలెరో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా అందులో ఇద్దరు మరణించారు.
ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు క్లీనర్ మృతి చందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరేకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్షతగాత్రులను అంబులెన్సు లో ఆసుపత్రికి తరలించారు.