ఈనెల 1న జరిగిన దోపిడీ కేసును భువనగిరి పోలీసులు ఛేదించారు. నిందితుడి నుండి బంగారు పస్తెల తాడు, బైక్, మొబైల్ స్వాదీనం చేసుకున్నట్లు డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బొడుప్పల్ చెందిన అంకువారి శివకుమార్, జమ నర్సింగ్ అనే వీరు చెడు అలవాట్లకు బానిసై ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 1న భువనగిరి పట్టణ శివారులోని డాల్ఫిన్ హోటల్ సమీపంలో ఒంటరిగా ఉన్న మహిళా ను చూసి అదే అదునుగా భావించిన శివ నర్సింగ్ వీరు మహిళా మెడలోంచి బంగారు పుస్తెలా తాడును లాక్కెళ్లారు.
బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం భువనగిరి లో నిందితుడు శివ ను అదుపులో తీసుకున్నట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. మరో నిందితుడు నర్సింగ్ పరారీలో ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితుడి నుండి 3.3 తులాల బంగారు పుస్తేలా తాడు, ద్విచక్ర వాహనం, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు శివ ను రిమాండ్ కు తరలించినట్లు, పరారీలో ఉన్న మరో నిందితుడు నర్సింగ్ ను త్వరలో పట్టుకుంటామని డీసీపీ వెల్లడించారు.