- నల్లా కలెక్షన్, కరెంటు కనెక్షన్ రాకుండా అడ్డుకున్నారు
- నా ఇంట్లో 100 గజాలు వాళ్లదే అని చెప్పి బెదిరించారు
- గాంధినగర్ లో భూ కబ్జాలు… సమాంతర ప్రభుత్వం
- పేదల భూములలో వెంచర్లు, ఫంక్షన్ హాల్ ల నిర్మాణం
గాంధినగర్, పిల్లలమర్రి గ్రామ శివారు లో వట్టె జానయ్య యాదవ్, ఆయన అనుచరులు తమ భూములను ఆక్రమించారని, బలవంతంగా సంతకాలు పెట్డించుకున్నారని పలువురు భాధితులు ఆరోపించారు. వట్టె జానయ్య యాదవ్ ఆక్రమాణలతో తాము భూములు కోల్పోయామని శ్రీపతి చెన్నమ్మ నాగయ్య, శ్రీపతి మధు, గార జయమ్మ, దానికెన స్వాతిలు విలేకరుల సమావేశంలో తెలిపారు. సూర్యాపేట పట్టణం లో ఎంఆర్ పిఎస్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గాంధినగర్ లో పేదలు, ఎస్సీ ల భూములను ఆక్రమించి వెంచర్లు వేశారని, ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశారని వారు తెలిపారు.
అంజనాపురి కాలనీలో 200 గజాలున్న తమ ఇంటి స్థలంలో 100 గజాలు వట్టె జానయ్య ఆక్రమించారని, అనుచరులను పంపి బెదిరించారని, తన భర్తను ప్రలోభపెట్టి తన ఇంటిని ఆక్రమించి, తనను బెదిరిస్తున్నారని దొనికెన స్వాతి తెలిపారు. తనకు ప్రాణహాని వుందని, రక్షణ కల్పించాలని ఆమె అన్నారు. దళిత బహుజనులను బెదిరించి భూములను లాక్కుంటె ఊరుకోబోమని, వారికి అండగా నిలుస్తామని ఎంఆర్ పిఎస్ నాయకులు యాతాకుల రాజన్న అన్నారు. ఈ సమావేశంలో పలువురు ఎంఆర్ పిఎస్, ఎంఎస్ పి నాయకులు పాల్గొన్నారు.