విశాఖ పోర్టు వద్ద తీవ్ర ఉద్రక్తత పరిస్థితి నెలకుంది. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రోడ్డెక్కారు. పోర్టును కార్మికులు ముట్టడించారు. పెదగం ట్యాడ జంక్షన్ నుంచి పోర్టు గేటు వరకు ర్యాలీగా వచ్చిన కార్మికులు ఆ తరువాత పోర్టను దిగ్భంధించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్ప డింది. విషయం తెలుసుకున్న పోలీ సులు భారీగా మోహరించారు. కనీస వేతనాలు చెల్లించాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకో వాలని కార్మికులు నినాదాలు చేశారు. కార్మికుల పోరాటానికి అఖిల పక్షాల పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.