అనంతపురం
సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలున్నాయని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. వివేకానంద హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నపళంగా సీఎం విశాఖ రాజధాని ప్రకటన వచ్చిందని అన్నారు.
హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడిన అంశం కీలకంగా మారింది. ఆ కాల్ డేటా వివరాలు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేసారని అయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో వేసిన అప్పీల్ పెండింగ్ లో ఉంది. ఇలాంటి సమయంలో సీఎం ప్రకటన హైకోర్టు దిక్కరణే అవుతుందని అన్నారు.