రామన్నపేట గ్రామంలోని ఓ ఇంట్లో దొంగలు పడి, ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు… గ్రామానికి చెందిన కోరుట్ల గంగమహేష్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గత బుధవారం మహేష్ గల్ఫ్ వెళ్లగ, అతని భార్య స్రవంతి పిల్లలతొ కలిసి తన పుట్టింటికి వెళ్ళి, ఈ రోజు ఉదయం వచ్చింది. అయితే ఇంటి తాళం పగులగొట్టి ఉండడం గమనించిన స్రవంతి చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం ఇచ్చింది.
వెంటనే చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే దొంగలు ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలోని దాదాపు ముడున్నర తులాల బంగారం, 14 తులాల వెండి, 4 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. డాగ్ స్క్వాడ్ బృందం, ఫోరేన్సీక్ విభాగం రంగంలోకి దిగి విచారణ చేపట్టగా, జాగిలo సమీపంలోని పోతారo రోడ్డు వద్ద ఆగింది. సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్ ఐ తీగల అశోక్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేస్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.