నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతంలో యువ గళం నారా లోకేష్ బాబు పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నుండి ఆత్మకూరు నియోజకవర్గం లోకి అడుగుపెట్టిన క్రమంలో మా తుఝే సలాం అంటూ నెల్లూరు జిల్లా సరిహద్దు నేలను నారా లోకేష్ బాబు ముద్దాడి తన పాదయాత్రను ప్రారంభించారు. బద్వేలు నియోజకవర్గంలో పాదయాత్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం రామనారా యణ రెడ్డి తనయురాలు కైవల్య రెడ్డి చేతుల మీదుగా పాదయాత్రను ఆనం రామ నారాయణ రెడ్డి స్వీకరించడం జరిగింది.
“దిశ” యాప్ తో మహిళలకు సంపూర్ణ రక్షణ ఆలమూరు ఎస్సై శివప్రసాద్.
పెన్నా నది పరవళ్ళు తొక్కినట్టు జిల్లా నలుమూలల నుండి నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని జనసంద్రంగా మార్చారు. నారా లోకేష్ బాబుని చూడడానికి తరలివచ్చిన జనానికి నిరాశ మిగిల్చారు. అనుకున్న దానికంటే మించి జనాలు రావడంతో ఒక దశలో నాయకులు సైతం తోపులాటకు గురయ్యారు నియంత్రణ కోల్పోయే స్థితి చేరుకోవడంతో నారా లోకేష్ బాబుని చూసే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రజలు కోల్పోవాల్సి వచ్చింది.
నెల్లూరు జిల్లా మర్రిపాడు,అనంతసాగరం మడలాల్లో మూడు రోజుల పాటు సాగే పాదయాత్రలో పదహారు వందల కిలోమీటర్ల మైలు రాయిని దాటే క్రమంలో చుంచులూరు గ్రామంలో శిలా ఫలకాన్ని ఏర్పాటు చేయనున్నారు. గ్రామస్తులతో నారా లోకేష్ బాబు ముఖాముఖిగా మాట్లాడి ఆ ప్రాంత సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా తన కార్యచరణను రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. అనంతసాగరంలో జరిగే బహిరంగ సభ అనంతరం వెంకటగిరి నియోజకవర్గంలోనికి యువ గళం పాదయాత్ర ప్రవేశించడానికి పూర్తి ఏర్పాటు ఇవ్వగలం పాదయాత్ర నిర్వాహకులు ఆనం రామ నారాయణరెడ్డి తెలియజేశారు.