హైదరాబాద్: కుషాయిగూడ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఆలయంలో దొంగతనానికి వచ్చిన దొంగ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. మంగళవారం రా త్రి 11 గంటలకు దుండగుడిని టెంపుల్ వాచ్ మెన్ రంగయ్య గమనించాడు.
రంగయ్య అరవడంతో దుండగుడు వాచ్ మెన్ పై రాళ్లతో దాడికి దిగాడు. వాచ్ మెన్ రంగయ్య ప్రతి దాడి చేయడంతో దుండగుడు అక్కడికక్కడె మృతి చెందాడు. పోలీసులు ఆలయానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి దగ్గర దొరికిన మొబైల్ ఫోన్ తో అతగి పేరు గండం రాజు గా గుర్తించారు. కేసు రిజిస్టర్ చేసి డెడ్ బాడీ మార్చురీకి తరలించారు.